గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మార్కెట్ ఎంత డల్‌గా ఉందో క్లియర్ గా అర్థమవుతోంది. నిజానికి ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, పండుగల టైమ్‌లో అయితే రికార్డు స్థాయికి చేరి అందరికీ షాకిచ్చాయి. కానీ, ఇప్పుడిప్పుడే ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది బంగారం కొనాలనుకునే వారికి కొంచెం ఊరటనిచ్చే విషయమే.
ఈరోజు (june 23) మంగళవారం 24K బంగారం 1 గ్రాము ధర రూ.207 తగ్గి రూ.14,591.. 22K బంగారం గ్రాము ధర రూ.13,375కి పడిపోయి రూ.190 తగ్గింది. ఇక 18K బంగారం 1 గ్రాము ధర రూ.10,944కి చేరి రూ.155 తగ్గింది.
భారతదేశంలో ఈరోజు 10 గ్రాముల బంగారం ధర చూస్తే :
24K ధర రూ.2,070 తగ్గి రూ.1,45,910, 22K ధర రూ.1,900 పడిపోయి రూ.1,33,750, 22K ధర రూ.1,550 తగ్గి రూ,1,09,440.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు చూస్తే :
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో 24K ధర రూ.1,45,910, 22K ధర రూ.1,33,750, 22K ధర రూ,1,09,440.
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్లో 24K ధర రూ.1,45,910, 22K ధర రూ.1,33,750, 22K ధర రూ,1,09,440.
బంగారం ధరల్లో అసలు విలువ, మేకింగ్ చార్జీలు, జీఎస్టీ ( 3% )తో మొత్తం అన్ని ఛార్జీలతో కలిపి ఉంటుంది. ఇక వెండి 1 గ్రాము ధర రూ.5 తగ్గి రూ.245, కిలోకి 5 వేలు తగ్గి రూ.2,45,000 చేరింది.
భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ బంగారం ధరలు, కరెన్సీ రేట్ల హెచ్చుతగ్గులు, స్థానిక సుంకాలతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కానీ, బంగారం ధరలు పెరగడానికి అత్యంత ముఖ్యమైన కారణం అంతర్జాతీయ ధరలే. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినప్పుడు, భారతదేశంలో బంగారం ధరలలో మార్పు కనిపిస్తుంది.
ఇక అమెరికా-ఇరాన్ శాంతి చర్చల విషయానికి వస్తే, స్విట్జర్లాండ్‌లో ఇరాన్ అధికారులతో జరిపిన చర్చలు శాంతి ఒప్పందానికి మంచి పునాది వేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు.
బంగారం, వెండి ధరలు తగ్గడానికి ముఖ్య కారణాలు:
* అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ వాల్యూ గత వారంలో ఏడాదిలోనే అత్యధిక స్థాయికి చేరింది. డాలర్ బాగా బలంగా ఉండటం వల్ల వేరే దేశాల కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనడం భారంగా మారుతుంది. దీనివల్ల మార్కెట్‌లో బంగారం కొనేవాళ్లు తగ్గి, డిమాండ్ పడిపోతోంది.
*సోమవారం భారీగా తగ్గిన ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. దీనివల్ల మార్కెట్‌లో ద్రవ్యోల్బణం మళ్లీ ఎక్కువవుతుందేమోననే టెన్షన్ మొదలైంది.
*ధరలు పెరుగుతుండటంతో.. అమెరికాకు చెందిన 'సెంట్రల్ బ్యాంక్' (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను ఇంకా ఎక్కువ కాలం పాటు అలాగే ఎక్కువగా ఉంచేలా కనిపిస్తోంది. సాధారణంగా మార్కెట్‌లో రేట్లు పెరిగినప్పుడు అందరూ బంగారంలో పెట్టుబడి పెడతారు. కానీ, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి, జనాలు బంగారం కంటే బ్యాంకుల్లో లేదా బాండ్లలో డబ్బులు దాచుకోవడానికే ఇష్టపడతారు. అందుకే బంగారం క్రేజ్ తగ్గుతోంది.
*గత వారం వరకు డిసెంబర్ నెలలో అమెరికా వడ్డీ రేట్లు పెంచుతుందనే అంచనాలు 61% మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మార్కెట్ వ్యాపారుల లెక్కల ప్రకారం.. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఏకంగా 88% కి చేరింది. ఈ భయమే బంగారం ధరలు తగ్గడానికి మెయిన్ రీజన్.
