డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ..2026-27 అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్

డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ..2026-27 అడ్మిషన్ల నోటిఫికేషన్  రిలీజ్

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, 2026-27 విద్యా సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి సర్టిఫికెట్ కోర్సుల అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

డిగ్రీలోబీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ కోర్సులు..పీజీలోతెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అర్థశాస్త్రం, చరిత్ర, ప్రభుత్వ పాలనా శాస్త్రం, రాజనీతి శాస్త్రం, సామాజ శాస్త్రం, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ లలో ఎం.ఏ..అలాగే.. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, పర్యావరణ శాస్త్రం, గణితశాస్త్రం, అనువర్తిత గణితశాస్త్రంలో ఎం.ఎస్సీ, ఎం.ఎల్ఐఎస్సి కోర్సులతో పాటు పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి.

దేశ పౌరులు ఎవరైనా తమ కనీస అర్హతను బట్టి ఈ కోర్సుల్లో చేరవచ్చు. అయితే అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

 విద్యార్హతల వివరాలు

డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా పదో తరగతి తర్వాత ఏదైనా రెండేళ్ల కోర్సు, డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, లేదా ఓపెన్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిన వారు కూడా ఈ కోర్సులకు అర్హులు.

►ALSO READ | CISFలో పారామెడికల్ పోస్టులు : ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్ చేసినోళ్లకు ఛాన్స్..

పలు  కోర్సుల విద్యార్హతలు, ఫీజుల పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్లు www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించవచ్చు.
ఇక ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును ఆగష్టు 7, 2026 లోపు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

డిగ్రీ 2021-22 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెందిన రెండు, మూడో సంవత్సరం విద్యార్థులు... అలాగే పీజీ 2023-24 నుంచి 2025-26 బ్యాచ్‌లకు చెంది, సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఇప్పుడు తమ ట్యూషన్ ఫీజును నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా TS ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు.