సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఏఎస్ఐ పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 07 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 24.
విభాగాల వారీగా ఖాళీలు: ఏఎస్ఐ (ఫార్మాసిస్ట్) 18, ఏఎస్ఐ (ఎక్స్– రే టెక్నీషియన్) 01, ఏఎస్ఐ (ల్యాబ్ టెక్నీషియన్) 5.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫార్మసీలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫార్మసిస్ట్ గా కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుంచి రేడియోలాజికల్ టెక్నాలజీ లేదా రేడియోగ్రఫీలో రెండేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుంచి మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ (డీఎంఎల్టీ)లో రెండేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 8.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: జులై 7.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) & డాక్యుమెంటేషన్, బేసిక్ వొకేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (బీవీఏటీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ cisfrectt.cisf.gov.inను సందర్శించండి.
