కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు.. ఐటీబీపీలో 282 మెడికల్ ఆఫీసర్ పోస్టులు..అప్లయ్ చేసుకోండిలా

కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు.. ఐటీబీపీలో 282 మెడికల్ ఆఫీసర్ పోస్టులు..అప్లయ్  చేసుకోండిలా

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్ఎస్)లో గ్రూప్-–ఏ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: గ్రూప్–ఏ మెడికల్ ఆఫీసర్. 

మొత్తం ఖాళీలు: 282. 

విభాగాల వారీగా ఖాళీలు: సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 5, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 162, మెడికల్ ఆఫీసర్ 115. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ/ సూపర్ స్పెషాలిటీ అర్హతలు కలిగి ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 10.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 400. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 8. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్/ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ recruitment.itbpolice.nic.inను సందర్శించండి. 

►ALSO READ | బీడీఎల్ లో ఇంజినీర్ పోస్టులు..లాస్ట్ డేట్ ఆగస్టు 21