ప్రతిష్టాత్మక రీసెర్చ్ సంస్థ అయిన నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్ సీఆర్ఏ టీఐఎఫ్ఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 8.
విభాగాల వారీగా ఖాళీలు: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ –బి 1, క్లర్క్–ఎ 2, డ్రైవర్–బి 2, లాబొరేటరీ అసిస్టెంట్–బి (ఎలక్ట్రానిక్స్) 2, సెక్యూరిటీ గార్డ్ 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి ఎస్ఎస్సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 33 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 31.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ tinyurl.com/ncrajob-2026ను సందర్శించండి.
