ఉన్నదే కొద్ది జీతం.. నెలంతా కుటుంబాన్ని పోషించాలి..వచ్చే జీతంతోనే అన్నీ కొనుక్కోవాలి.. పెరుగుతున్న ఖర్చులు..పిల్లలు చదువులు ..కుటుంబాన్ని ఎలా సాకాలిరా దేవుడా అని ఓపక్క దిక్కుతోచని స్థితిలో ఉంటే.. వచ్చే జీతంలో సగం నీకు..సగం నాకు అని అధికారులు కష్టార్జితాన్ని మింగేంస్తుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది..? కడుపు మండిపోతుంది కదా..? ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి కూడా ఇలాగే మండింది. యూపీ వైద్యశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు.. ఉన్నతాధికారిపై తిరగబడిన వీడియో వైరల్ అవుతోంది. కిందిస్థాయి కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ కార్మికులకు జరుగుతున్న అన్యాయం, ఉన్నతాధికారుల దోపిడీ, బ్రోకర్లు, ఏజెంట్ల మధ్యవర్తిత్వంపై చర్చకు దారితీసింది.
యూపీలోని బరేలీ మున్సిపాలిటీలో పరిధిలో పనిచేస్తున్న వైద్యాధికారిపై ఓ పారిశుధ్య కార్మికుడు చూపించిన బాధ, అసహనాన్ని ఈ వీడియో స్పష్టం చూపిస్తోంది. నెటిజన్ల కామెంట్స్ చూస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ ను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రక్త, చెమట చిందించి పనిచేస్తే పారిశుధ్య కార్మికులు శ్రమను దోచుకుని అధికారులు జేబులు నింపుకోవడంతో సహనంహద్దులుదాటకం సహజం అనిపిస్తోంది. నెలకు 13 వేల రూపాయలు ఇస్తామని కాంట్రాక్టు కుదుర్చుకొని 7500 లు చేతులో పెడితే తనకు జరిగిన అన్యాయం, అధికారుల దోపిడీపై సహనం కోల్పోయి కార్మికుడు మండిపడుతూ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వీడియోలో వినిపిస్తున్నారు. గాజులు, లంగా తీసుకొచ్చి వేసుకొని అధికారికి బహుమతిగా ఇచ్చాడంటే అతనిలో ఎంత బాధ ఉందో చెప్పొచ్చంటున్నారు నెటిజన్లు.
బ్రోకర్లు, ఏజెంట్లు, మధ్యవర్తుల సంఖ్య పెరిగింది.. పేదరికం ఇప్పుడు ఒక నేరంగా మారిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ అవినీతి వ్యవస్థ కొత్త భారత్ కు తివాచీ పరుస్తోందంటున్నారు. ఇక ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ వీడియోలో కనిపిస్తున్న అధికారి బొజ్జ చూస్తేనే కనిపిస్తుంది అతను ఎంత పెద్దవాడో అంటూ కామెడీగా, సెటైరికల్ రాశారు.
खून-पसीना हमारा, आधी तनख्वाह तुम्हारी... नहीं चलेगी यह तानाशाही!
— UP Congress (@INCUttarPradesh) June 23, 2026
उत्तर प्रदेश के बरेली से आई यह तस्वीर भाजपा सरकार के 'जीरो टॉलरेंस' दावों की धज्जियां उड़ा रही है। जब खून-पसीना बहाने वाले सफाईकर्मियों का हक मारकर अधिकारी अपनी जेबें भरने लगें, तो सब्र का बांध टूटना लाजमी है। 13… pic.twitter.com/FJ4yzswb5b
