SIR పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తున్నారు: భట్టి విక్రమార్క

SIR పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తున్నారు: భట్టి విక్రమార్క

బీజేపీ కేవలం అధికారం కోసమే అడ్డదారులు తొక్కుతోందని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.వైరాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భట్టి .. భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 

రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ తమకు అనుకూలంగా లేని ఓట్లను, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్ర చేస్తోందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓటర్ల జాబితా విషయంలో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని... ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఓటర్ల లిస్ట్‌ను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకును రక్షించుకునేందుకు కార్యకర్తలంతా సమిష్టిగా పోరాడాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.