కొద్దిగా పెరిగిన తర్వాత మళ్లీ గోల్డ్ రేట్లు సామాన్య ప్రజలకు ఊరటను కలిగిస్తూ దిగొస్తున్నాయి. ప్రధానంగా ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విజయవంతం అవుతున్నప్పటికీ మధ్యలో వస్తున్న చిన్నపాటి సమస్యలు బులియన్ మార్కెట్లను కొద్దిగా ఇబ్బంది కలిగిస్తున్నాయి. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ పుంజుకోవటం, డాలర్ డిమాండ్ బలంగా ఉండటం వంటి కారణాలతో గోల్డ్ వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని అనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రేట్లను పరిశీలించటం చాలా బెటర్.
జూన్ 24న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.27 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 433గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 230గా కొనసాగుతోంది.
బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 24, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 40వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది.
