తైక్వాండోలో గిన్నిస్ రికార్డ్.. 35 నిమిషాల పాటు 533 మంది క్రీడాకారుల ప్రదర్శన

తైక్వాండోలో గిన్నిస్ రికార్డ్.. 35 నిమిషాల పాటు 533 మంది క్రీడాకారుల ప్రదర్శన

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని గచ్చిబౌలి ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియం వేదికగా ‘లార్జెస్ట్‌‌‌‌‌‌‌‌ తైక్వాండో లెసన్‌‌‌‌‌‌‌‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డులో నమోదైంది. ఎంజేఆర్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ తైక్వాండో అకాడమీ, సుమన్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో మార్షల్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌  గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎం.జయంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

తొమ్మిదేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు 533 మంది క్రీడాకారులు, అకాడమీ విద్యార్థులు, కోచ్‌‌‌‌‌‌‌‌లు, మార్షల్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఔత్సాహికులు పాల్గొన్నారు. 35 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రదర్శన నిర్వహించారు.

2 వేల నుంచి 3 వేల జంపింగ్‌‌‌‌‌‌‌‌ కిక్స్‌‌‌‌‌‌‌‌తో పాటు వివిధ రకాల పంచ్‌‌‌‌‌‌‌‌లు, బ్లాక్‌‌‌‌‌‌‌‌లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి స్వప్నిల్‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు. అనంతరం గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఎం.జయంత్‌‌‌‌‌‌‌‌రెడ్డికి గిన్నిస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాస్టర్‌‌‌‌‌‌‌‌ గజేందర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, సమన్వయకర్త సుమన్‌‌‌‌‌‌‌‌, ఖాజా ఆఫ్రిది, ఖలీల్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.