జబర్దస్త్ ఫైమా సడన్ మ్యారేజ్ ట్విస్ట్.. 9 ఏళ్ల రహస్య ప్రేమను గెలిపించుకుని భర్తతో కలిసి ఎమోషనల్ పోస్ట్!

జబర్దస్త్ ఫైమా సడన్ మ్యారేజ్ ట్విస్ట్.. 9 ఏళ్ల రహస్య ప్రేమను గెలిపించుకుని భర్తతో కలిసి ఎమోషనల్ పోస్ట్!

బుల్లితెరపై తనదైన యాస, ఊరమాస్ కామెడీ పంచ్‌లతో నవ్వులు పూయిస్తుంది 'జబర్దస్త్' ఫైమా. పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసి, జబర్దస్త్‌తో పాపులర్ అయి, ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. నిఖార్సయిన టాలెంట్‌తో ఇండస్ట్రీలో సెటిలైపోయిన ఈ లేడీ కమెడియన్.. లేటెస్ట్ గా తన ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, ఎవరికీ చెప్పాపెట్టకుండా చాలా సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకుని అందరికీ షాకిచ్చింది.

ఎవరా మిస్టరీ మ్యాన్?
ఫైమాను పెళ్లాడిన ఆ లక్కీ జెంటిల్‌మన్ పేరు ప్రవీణ్ నాయక్. అయితే ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ ఉంది. వీరిద్దరూ ఏకంగా తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. కెరీర్ ప్రారంభం కాకముందు నుంచే వీరి లవ్ స్టోరీ నడుస్తోంది. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, అడ్డంకులు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి ఫైనల్‌గా ఈ రోజు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.

ఫైమా ఎమోషనల్ పోస్ట్!
పెళ్లి తర్వాత తన భర్త ప్రవీణ్‌తో కలిసి రిజిస్టర్ ఆఫీస్ లో  దిగిన ఫోటోలను, వీడియోను ఫైమా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. " వారు మమ్మల్ని అనుమానించారు. మమ్మల్ని జడ్జ్ చేస్తూ విమర్శించారు. మమ్మల్ని ఎలాగైనా విడదీయాలని గట్టిగా ప్రయత్నించారు. కానీ మా ప్రేమ మాత్రం ప్రతి అడ్డంకినీ అధిగమించి చాలా బలంగా నిలిచింది. ఈ ప్రయాణంలో లెక్కలేనన్ని పోరాటాలు, అంతులేని సహనం ఉన్నాయి. ఒకరినొకరు వదిలేయడానికి మాకు వేయి కారణాలు కనిపించినా.. మేము మాత్రం ప్రతిరోజూ ఒకరి కోసం ఒకరమే బతికాం, ఒకరినొకరే ఎంచుకున్నాం. ఫైనల్‌గా.. ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం" అంటూ తన లవ్ లైఫ్‌లోని పెయిన్‌ను, సక్సెస్‌ను పంచుకుంది.

శుభాకాంక్షల వెల్లువ..
లవ్ మ్యారేజ్ అంటేనే ఇంట్లో పెద్దలను ఒప్పించడం, సమాజంతో పోరాడటం లాంటి ఎన్నో టాస్క్‌లు ఉంటాయి. ఫైమా కూడా వాటన్నింటినీ దాటుకుని లవ్ స్టోరీకి హ్యాపీ ఎండ్ కార్డ్ వేయడంతో అభిమానులతో పాటు జబర్దస్త్ కో-స్టార్స్, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ చెప్తున్నారు. మొత్తానికి లవ్ మ్యారేజ్‌తో లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసిన ఫైమా-ప్రవీణ్ జంటను నెటిజన్లు అభినందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FAIMA (@faima_patas)