Super Subbu Trailer: అడల్ట్ ఎడ్యుకేషన్ మాస్టర్‌గా సందీప్ కిషన్.. 'సూపర్ సుబ్బు' ట్రైలర్ చూశారా?

Super Subbu Trailer: అడల్ట్ ఎడ్యుకేషన్ మాస్టర్‌గా సందీప్ కిషన్.. 'సూపర్ సుబ్బు' ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ యంగ్  హీరో సందీప్ కిషన్, బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు'. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియా ప్రెజెంట్ చేస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ తెలుగు కామెడీ సిరీస్ ఇది. 'డీజే టిల్లు' ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ క్రేజీ సిరీస్ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల చేశారు.

అసలు కథేంటంటే?

ఒక అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం. ఇదీ ఈ సిరీస్ క్యాప్షన్. సుబ్రమణ్యం చిలుకూరి రావు అలియాస్ సుబ్బు (సందిప్ కిషన్) అనే ఒక పల్లెటూరి యువకుడికి ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని 'మాకిపూర్' అనే వింత ఊరికి పోస్టింగ్ వస్తుంది. తన తండ్రి కుకటేశ్వరరావు (మురళీ శర్మ) ముందు పరువు నిలబెట్టుకోవాలని సగటు మాస్టర్‌లా క్లాస్ రూమ్‌లోకి అడుగుపెట్టిన సుబ్బుకి అక్కడ ఊహించని షాక్ తగులుతుంది.

అక్షరం రాని, అస్సలు అవగాహన లేని ఆ ఊరి జనాలకి మనోడు 'అడల్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్'గా పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఒకవైపు జాబ్ టెన్షన్స్, లవ్ ప్రాబ్లమ్స్, ఇంకోవైపు ఊరి జనాల అపార్థాలు.. ఇలా ఒక సమస్యను సాల్వ్ చేయబోయి ఐదు కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటాడు సుబ్బు. ప్రతి టాపిక్ ఒక పెద్ద డిబేట్‌గా మారడం, ఊరంతా పుకార్లు షికార్లు చేయడం.. ఈ ప్రాసెస్‌లో వచ్చే వినోదం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

కాస్టింగ్ మామూలుగా లేదుగా!

ఈ సిరీస్‌లో గ్లామర్ అండ్ యాక్టింగ్ డోస్ పెంచడానికి బాలీవుడ్ 'లిటిల్ థింగ్స్' ఫేమ్ మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఇందులో ఒక క్రేజీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, ఎలాగైనా యాక్టర్ అవ్వాలని కలలుకనే క్యారెక్టర్‌లో కనిపించనుంది. వీరితో పాటు కామెడీ కింగ్ బ్రహ్మానందం, వర్సటైల్ యాక్టర్ మురళీ శర్మ, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, గెటప్ శ్రీను, జీవన్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి ఈ సిరీస్‌ను నిర్మించారు.

స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

చిన్న టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో, ఫుల్ లెంగ్త్ హ్యూమర్ అండ్ ఎమోషన్స్‌తో సాగే ఈ అడల్ట్ కామెడీ అండ్ సోషల్ డ్రామా జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. మరి మన 'సూపర్ సుబ్బు' మాకిపూర్ విలేజ్ జనాలను ఎలా మార్చాడు? తను ఎలా మారాడు? అనేది తెలియాలంటే జూలై 2 వరకు వెయిట్ చేయాల్సిందే!