BhimaaTeaser: రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా..

BhimaaTeaser: రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా..

గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష (Harsha) తెరకెక్కిస్తున్న చిత్రం భీమా (Bhimaa). యూనిక్ యాక్షన్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా రాబోతున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్న గోపీచంద్ లుక్, భీమా టైటిల్‌ డిజైన్ అదిరిపోయింది.  

లేటెస్ట్గా భీమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.యధా యధా ధర్మస్య శ్లోకంతో మొదలైన టీజర్ ఆడియన్స్ను అట్ట్రాక్ట్ చేస్తోంది. హీరో గోపి చంద్ మాస్ ఎలివేషన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. చుట్టూ అడవి..వెంటాడే రాక్షసులు..భయపడే జనాలు..పాడుబడ్డ గుడి..మధ్యలో అఘోరలు ఇవన్నీ కలిపి..టీజర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించారు మేకర్స్.

రాక్షసుడుని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా అంటూ బ్యాక్గ్రౌండ్ డైలాగ్తో..గోపి చంద్ ఎంట్రీ అదిరిపోయింది.టీజర్ చివర్లో..గోపీచంద్ ఎద్దుపై ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో గోపీచంద్ కమ్ బ్యాక్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సలార్‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ పై ఇంటెన్స్ కలిగిస్తోంది. ఈ సినిమాలో గోపి చంద్కు జోడీగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌లు నటిస్తున్నారు. భీమా ఫిబ్రవరి 16న థియేటర్లో రిలీజ్ కానుంది.