బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏం చేసినా ఒక సెన్సేషన్. ఆయన సినీ ప్రయాణంలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ 'లగాన్' రిలీజై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ మైలురాయిని అందుకున్న సందర్భంగా.. ముంబైలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. సల్మాన్ ఖాన్, జావేద్ అక్తర్, కాజోల్, జూహీ చావ్లా వంటి దిగ్గజాలు ఈ ఈవెంట్‌కు హాజరైయ్యారు. ఈ సంర్భంగా జరిగిన ఒక క్రేజీ మూమెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కాజోల్ పంచ్..
1997 నాటి సూపర్ హిట్ మూవీ 'ఇష్క్' జంట అమీర్, కాజోల్, జూహీ చావ్లా దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మెరిశారు. ఈ సందర్భంగా కాజోల్ అమీర్ ఖాన్‌పై చేసిన ఒక సరదా కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 'లగాన్' సినిమా దగ్గర నుంచి చూస్తే.. అమీర్ ఖాన్‌కు సినిమాల ఎంపికలో ఎంతటి అద్భుతమైన టేస్ట్ ఉందో అర్థమవుతుంది. ఆయన సినిమాల్లోనే కాదు, మహిళల ఎంపికలో కూడా అమీర్‌కు చాలా మంచి టేస్ట్ ఉంది అంటూ కాజోల్ నవ్వుతూ కామెంట్ చేసింది. దీంతో అమీర్ ఖాన్ ఒక్కసారిగా సిగ్గుపడుతూ.. షాక్‌కు గురవ్వగా.. అక్కడున్న వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. కాజోల్ ఈ కామెంట్స్ చేస్తున్నప్పుడు అమీర్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు కూడా అక్కడే ఉన్నారు.
జూహీ చావ్లా సైతం వదల్లేదుగా..
మరోవైపు నటి జూహీ చావ్లా కూడా తనదైన శైలిలో అమీర్‌పై సరదా పంచులు విసిరారు. నా పక్కన కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్లందరూ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయారు, చూశారా అంటూ అమీర్ రేంజ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూనే స్వీట్ కౌంటర్ ఇచ్చింది. అమీర్, కాజోల్‌లు గతంలో 'ఫనా' (2006) వంటి బ్లాక్‌బస్టర్‌లో నటించారు.
►ALSO READ | మహేష్ బాబుతో బుచ్చిబాబు నెక్స్ట్ మూవీ? 'పెద్ది' సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
జూలై 5న మూడో పెళ్లి?
ప్రస్తుతం అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై బాలీవుడ్‌లో తెగ చర్చ నడుస్తోంది. రీనా దత్తా, కిరణ్ రావులతో విడిపోయిన తర్వాత కూడా వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న అమీర్.. త్వరలోనే తన పార్ట్నర్ గౌరీ స్ప్రట్‌తో కలిసి ఒక కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నారట. జూలై 5న వీరి వివాహం జరగనుందనే వార్తల నడుమ కాజోల్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 'లగాన్ చిత్రాన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేశారు.
