గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సన.. తన నెక్స్ట్ మూవీకి పక్కాప్లాన్ తో రెడీ అవుతున్నాయి. అయితే ఆయన ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలపబోతున్నారంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'పెద్ది' గ్రాండ్ సక్సెస్ మీట్‌లో బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
మహేష్ బాబుతో మూవీ..
మహేష్ బాబుతో ఒక భారీ మైథలాజికల్ సినిమా ప్లాన్ చేస్తున్నారట కదా అని ఓ రిపోర్టర్ అడగ్గా.. బుచ్చిబాబు నవ్వుతూ, చాలా చాకచక్యంగా సమాధానమిచ్చారు. దానికింకా టైమ్ ఉంది. పెద్దలు ఇక్కడే ఉన్నారు.. సమయమే అన్నింటినీ నిర్ణయిస్తుంది అంటూ సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఆయన ఈ విషయాన్ని ఖండించకపోవడంతో, సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడే పండగ చేసుకోవడం మొదలుపెట్టేశారు.
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' రికార్డు..
రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు చేసి బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది. ఇండియాలోనే రూ.200 కోట్ల నెట్ కలెక్షన్లతో రికార్డులు తిరగరాసిన ఈ డైరెక్టర్, ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కెప్టెన్ అయిపోయారు. ఆయన నెక్స్ట్ మూవీపై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది.
'వారణాసి' తర్వాత బుచ్చిబాబేనా?
ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో గ్లోబ్-ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ కాలేదు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడు బుచ్చిబాబు లైన్‌లోకి రావడం, అది కూడా మైథలాజికల్ సబ్జెక్ట్ అనడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవేళ బుచ్చిబాబు-మహేష్ బాబు కాంబో సెట్ అయితే.. టాలీవుడ్‌లో మరో మైండ్‌బ్లోయింగ్ రికార్డ్స్ క్రియేట్ అవ్వడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
