రెండు రోజుల్లో రూ. 2 వేల కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్..!

రెండు రోజుల్లో రూ. 2 వేల కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్..!

హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాలండ్, జెండాయా జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హీరో యాక్షన్ సెన్సేషన్ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day)  బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.. డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 30న ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే భారత్‌లో అడుగుపెట్టింది. ఇండియాలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఈ చిత్రం మార్వెల్ అభిమానులకు ఒక మాస్ ఫెస్టివల్ లా మారిపోయింది.

ఇండియన్ సినీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే భారత్‌లో రూ.131.46 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ మూవీలో జెండాయా, జాకబ్ బటాలాన్, సాడీ సింక్, మార్క్ రఫెలో కీలక పాత్రల్లో నటించారు . భారత్ లో తొలి రోజు రూ.72.44 కోట్లు, రెండో రోజు మరో రూ.59.02 కోట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తం కలెక్షన్లు రూ.131.46 కోట్లకు చేరాయి. నెట్ కలెక్షన్లు కూడా రూ.100 కోట్ల మార్క్‌ను దాటడంతో, భారత మార్కెట్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన హాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Also Read : యష్ ఫ్యాన్స్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2D, 3D, IMAX ఫార్మాట్లలో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువత, మార్వెల్ అభిమానులు భారీగా థియేటర్లకు తరలివస్తుండటంతో ఆక్యుపెన్సీ శాతం రోజురోజుకూ పెరుగుతోంది. రెండో రోజు సాయంత్రం, నైట్ షోలలో 60 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం.

ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విదేశీ మార్కెట్లలో భారీ ఓపెనింగ్స్ నమోదు చేస్తూ తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ.1,925 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా 'బ్రాండ్ న్యూ డే' నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' తర్వాత జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రపంచం తనను పూర్తిగా మర్చిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తూ, న్యూయార్క్ నగరాన్ని కాపాడే బాధ్యతను పూర్తిగా తన భుజాలపై వేసుకున్న పీటర్ పార్కర్ ప్రయాణం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భావోద్వేగాలతో పాటు యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. వీకెండ్‌లో కూడా ఇదే జోరు కొనసాగితే..  భారత్‌లోనే ఈ చిత్రం అత్యంత భారీ వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాల జాబితాలో అగ్రస్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.