
సుహాస్ హీరోగా రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. మాళవిక మనోజ్ హీరోయిన్. ‘జో’అనే మలయాళ చిత్రంతో ఆకట్టుకున్న ఆమెకు తెలుగులో ఇదే తొలిచిత్రం.
ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి లేటెస్ట్గా ‘గల్లీ స్టెప్’అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్‌ను హీరో సుహాస్ పాడటం విశేషం. ఇపుడీ ఈ తీన్ మార్ సాంగ్ యూత్ కు తెగ నచ్చేస్తోంది. ఈ క్రమంలో సుహాస్ గల్లీ స్టెప్ దుమ్మురేపుతోంది అంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Let's Vibe to the Mass Anthem #GullyStep in the vocals of @ActorSuhas 🎶🎙️
— V Arts (@VArtsFilms) June 27, 2025
3rd Single from #OhBhamaAyyoRama Releasing Today at 4.05 PM 💥🕺
A @radhanmusic Musical 🥁#OBAR In Theatres on JULY 11th ❤️🔥#MalavikaManoj @anitahasnandani @NenuMeeRamm @HarishNallaOffl @LyricsShyam pic.twitter.com/F8gNqLCJfM
‘‘ఓ మెరుపులా చిందులే వేయరా.. మన్ను మిన్ను కూడా మురిసిపోయేలా.. నీ స్టెప్పుకే డప్పులే అదరగా.. ఫుల్లు ఇరగదీయి డిస్కో దివానా.. గల్లి గల్లి స్టెప్పే.. లొల్లి లొల్లి పెట్టే డప్పే..” అంటూ కాసర్ల శ్యామ్ రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. జిత్తు మాస్టర్ కొరియోయోగ్రఫీ అందించిన ఈ పాటలో సుహాస్ హుషారైన స్టెప్పులతో ఇరగదీశాడు. ‘‘ఏ ఊరికి వెళ్ళినా.. ఏ బీట్ కొట్టినా.. మన హార్ట్ బీట్ మాత్రం గల్లీ స్టెప్’’ అనే క్యాప్షన్ మూవీపై క్యూరియాసిటీ పెంచింది.
సాంగ్ రిలీజ్ సందర్భంగా నిర్మాత హరీష్ నల్ల మాట్లాడుతూ ‘నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా సాగిన ఈ పాట ప్రతి గల్లీలో తీన్‌మార్ సాంగ్‌లా ఆకట్టుకుంటుంది. సుహాస్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం.
►ALSO READ | OTT Crime: మూడు ఓటీటీల్లోకి తెలుగు క్రైమ్ డ్రామా.. వ్యవస్థను ప్రశ్నించే కథకు మంచి రెస్పాన్స్
ఇందులో ప్రతి సీన్ వినోదం పంచడంతో పాటు సుహాస్, మాళవిక మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు. లవ్‌స్టోరీకి తగ్గట్టుగా రథన్ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చాడని, ఆరుపాటలు వేటికవే బ్యూటిఫుల్‌గా ఉంటాయని దర్శకుడు తెలియజేశాడు. జులై 11న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.