స్టూడెంట్లపై మాజీ సర్పంచ్ లైంగిక వేధింపులు

స్టూడెంట్లపై మాజీ సర్పంచ్ లైంగిక వేధింపులు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల ప్రభుత్వ సంక్షేమ హాస్టల్​స్టూ డెంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదుతో తంగళ్లపల్లి మండలం మండె పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచి తంగళ్లపల్లి దేవయ్యను అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ రాహుల్​ హెగ్డే తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో మరో ఇద్దరిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామన్నారు.

టీఆర్ఎస్ నుంచి తొలగింపు

తంగళ్లపల్లి దేవయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీం దర్ రావు తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి విజ్ఞప్తి చేశామన్నారు.

హాస్టల్​ వార్డెన్ సస్పెన్షన్

లైంగిక వేధింపుల వ్యవహారంలో శాఖపరమైన విచారణకు కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. ఈ మేరకు ఎస్సీ డెవలప్ మెంట్ ఆఫీసర్ రాజేశ్వరి విచారణ జరిపి డ్యూటీని నిర్లక్ష్యం చేసిన వార్డెన్ భూదేవిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేవయ్య కాంట్రాక్ట్​సస్పెండ్ చేసినట్లు చెప్పారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో రక్షణ చర్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

see also: బీజేపీ ఓట్లు పెరిగాయ్​

నిజాం టిఫిన్ బాక్స్ కొట్టేసింది వీరే..

దిష్టి బొమ్మలుగా మారిన ముద్దుగుమ్మలు