Cricket World Cup 2023: అప్పుడు బ్రాడ్.. ఇప్పుడు పాండ్య: హార్దిక్ మంత్రానికి పాక్ బ్యాటర్ బలి

Cricket World Cup 2023: అప్పుడు బ్రాడ్.. ఇప్పుడు పాండ్య: హార్దిక్ మంత్రానికి పాక్ బ్యాటర్ బలి

ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని ఔట్ చేయాలంటే దానికి రెండే మార్గాలు. ఒకటి అద్భుతమైన బంతి వేయాలి లేకపోతే బ్యాటర్ ఏకాగ్రతను చెడగొట్టాలి. గ్రేట్ డెలివరీ వేయడం అంత సామాన్యమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది బౌలర్లు ఆటగాళ్ళని స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అయితే చాలా కొద్దిమంది మాత్రం తమ శైలిలో ఆటగాళ్లను మైమరిపిస్తారు. భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఈ కోవలోకే వస్తాడు. తాజాగా పాక్ తో హార్దిక్ చేసిన మ్యాజిక్ కి పాక్ ఓపెనర్ పెవిలియన్ కి చేరాల్సి వచ్చింది. 

బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్న అహ్మదాబాద్ పిచ్ పై తన మొదటి రెండు ఓవర్లలోనే  హార్దిక్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటికే క్రీజ్ లో కుదురుకుని 36 పరుగులు చేసిన ఇమామ్ మంచి జోరు మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ ఇన్నింగ్స్ 13 వ ఓవర్లో బంతితో ఏదో మాట్లాడుతున్నట్లుగా కనిపించాడు. ముఖం కింద వైపుగా ఉంచి ఏదో మంత్రం చదువుతూ హార్దిక్ చేసిన ఈ వింత ప్రయత్నం ఫలించింది. ఆ తర్వాత బంతికే ఇమాముల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు.


ప్రస్తుతం పాండ్య  చేసిన ఈ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో ఇంగ్లాండ్ పేసర్ యాష్ సిరీస్ లో ఇలాంటి మ్యాజిక్ చేసి ఆసీస్ బ్యాటర్ అవుట్ అవ్వడానికి కారణమయ్యాడు. ఇప్పుడు హార్దిక్ కూడా ఇలా చేసి వికెట్ తీయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇమామ్, షఫీక్  పర్వాలేదనిపించగా, బాబర్ అజామ్ 50 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో రిజవాన్ 47 పరుగులతో, సౌద్ షకీల్ ఒక పరుగుతో క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్ కి రెండు హార్దిక్ పాండ్య కి ఒక వికెట్ లభించింది.                                 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)