
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నిర్మిస్తోన్న మూవీ సుందరం మాస్టార్ (Sundaram Master). కమెడియన్ హర్షా చెముడు( Harsha chemudu) ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ పోస్టర్, టీజర్తో ఆసక్తి కలిగించిన విషయం తెలిసేందే.
లేటెస్ట్గా సుందరం మాస్టార్ ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ ప్రేక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ కొత్త కామిక్ యాంగిల్లో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఒక అడవిలో మాస్టర్గా వెళ్లిన హర్షా..అక్కడ లెసన్స్ తనదైన శైలిలో చెబుతూ..ఆదివాసీలకు ఏబీసీడీలు నేర్పించే సీన్స్తో ట్రైలర్ స్టార్ట్ కాగా..మాస్టార్ హర్షా ఇంగ్లీష్ మాట్లాతుండగా..ఆ అడవిలోని వారు మాస్టర్ కంటే ఫ్లూయెంట్ ఇంగ్లిష్ లో మాట్లాడటం చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
ఆ గూడెంలోని ప్రజల వేషధారణ..వారు మాట్లాడే ఫ్ల్యూయెంట్ ఇంగ్లీష్..హర్షా ఇచ్చే కామిక్ ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పంచుతున్నాయి. ఇక ఈ మూవీ టైటిల్ కింద టాగ్ లైన్ 1930ని కొట్టేస్తూ..2023లో ఆదివాసీలు ఎలా ఉంటారనే ఫన్ యాంగిల్‌ను మూవీలో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
సుందరం మాస్టర్ స్టోరీ విషయానికి వస్తే..
అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఒక గిరిజన గ్రామానికి..అసలు ఈ మాత్రం ఇంగ్లీషే రాని ఒక సోషల్ మాస్టర్ ను ప్రభుత్వం ఏరికోరి పంపుతుంది. అందుకు కారణం అతడు చూడటానికి నల్లగా ఉండటమే. అతడే సుందరం.ఇక ఆ గ్రామంలో అమ్మాయిలకు నల్లవారు అంటే అదోరకమైన మక్కువ. అందుకే సుందరాన్ని అతిసుందరుడు గా భావించి రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు గిరిజనులు. అయితే సుందరాన్ని ఆ ఊరికి పంపడానికి కారణం..ఆ ఊరిలో ఏదో తెలియని రహస్యం ఉందని సుందరానికి తెలుస్తోంది. ఆ రహస్యం ఏంటీ? అనేది మిగతా కథ.
శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది.ఇందులో దివ్య శ్రీపాద (Divya Sripada) మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. సుధీర్ కుమార్ కుర్రాతో కలిసి హీరో రవితేజ (RaviTeja) టీమ్ వర్క్స్(Team Works), గోల్డెన్ మీడియా(Golden media) బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.