Kerala Crime Files Season 2: కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 వచ్చేస్తోంది..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Kerala Crime Files Season 2: కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 వచ్చేస్తోంది..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మలయాళంలో తెరకెక్కే మూవీస్ కి, వెబ్‌ సిరీస్‌లకూ యావత్‌ సినీ ప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. చాలా తక్కువ బడ్జెట్ తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తూ మేకర్స్ తెరకెక్కించే విధానానికి అందరు ఫిదా అవుతారు.

2023లో డైరెక్టర్ అహ్మద్‌ కబీర్‌ ఫస్ట్ టైం మలయాళ ఇండస్ట్రీలో వెబ్‌సిరీస్‌ తెరకెక్కించాడు. అదే కేరళ క్రైమ్ ఫైల్స్(Kerala Crime Files). ఎలాంటి అంచనాలు లేకుండా రూపొందిన ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌’ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోరిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. క్రైమ్, థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమాలంటే ఆడియన్స్ కు పండుగనే చెప్పుకోవాలి. అందులో వచ్చే ట్విస్ట్స్, లాజిక్స్తో కూడిన సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 

లేటెస్ట్గా కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ రెండో సీజన్(Kerala Crime Files Season 2)  రాబోతోందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్( Disney Plus Hotstar) పోస్టర్ రిలీజ్ చేసింది. "వెలికితీసిన ఓ క్రైమ్ కొత్త చాప్టర్ వేచి చూస్తోంది. హాట్ స్టార్ స్పెషల్స్, కేరళ ఫైల్స్ సీజన్ 2 త్వరలోనే" అనే క్యాప్షన్ తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ విషయాన్ని పోస్టర్ లో ప్రకటించింది.ఈ పోస్టులో డైరెక్టర్ అహ్మద్ ఖబీర్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ లను కూడా హాట్ స్టార్ ట్యాగ్ చేసింది. కొత్త సీజన్ ఎప్పటి నుంచి అన్నది మాత్రం డేట్ ప్రకటించలేదు మేకర్స్. 

ఈ క్రేజీ అప్డేట్తో ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ పోస్టర్ నుంచే సీజన్ 2లో జరగబోయే కొత్త క్రైమ్ ఏంటనేది ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు మేకర్స్. ఓ పోలీసు ఆఫీసర్ వెనుక భాగాన్ని చూపిస్తూ అతని టోపీపై క్రికెట్ స్టేడియాన్ని ఉంచారు. ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ బట్టి..ఇదొక బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి క్రైమ్స్ చుట్టూ కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ రెండో సీజన్ తిరిగేలా కనిపిస్తోంది.

కేరళ క్రైమ్‌ ఫైల్స్‌ సీజన్ 1 కథేంటంటే:

శరత్‌ అనే వ్యక్తి లాడ్జిలో రిసెప్షనిస్ట్‌గా వర్క్ చేస్తుంటాడు. ఓ రోజు నీటి సమస్య తలెత్తగా..ఏదైనా రూమ్‌లో లీకేజీ ఉందోమోనని చెక్‌ చేస్తాడు. ఈ క్రమంలో ఓ రూమ్‌లో మహిళ మృతదేహాన్ని చూసి షాకై, పోలీసులకు సమాచారం ఇస్తాడు. అయితే ఆమె..వేశ్య స్నప్న అని ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు తెలుసుకుంటారు. కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతారు. ఆమెను హత్య చేసింది ఎవరు? పోలీసులు అతణ్ని ఎలా పట్టుకున్నారు? వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది మిగతా కథ.