Sreeleela: ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది.. శ్రీలీల అందుకే నో చెప్పింది!

Sreeleela: ట్రైలర్తో క్లారిటీ వచ్చేసింది.. శ్రీలీల అందుకే నో చెప్పింది!

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వైర్(Tillu Squire). బ్లాక్ బస్టర్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను  దర్శకుడు మల్లిక్ రామ్(Mallik Ram) తెరెకక్కిస్తున్నారు. డీజే టిల్లు భారీ విజయం సాధించిన నేపధ్యంలో టిల్లు స్క్వైర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. పార్ట్ 1 లాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న టిల్లు స్క్వైర్ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్బంగా రిలీజైన ఈ ట్రైలర్ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. డీజే టిల్లు లాగే ఫుల్ ఆన్ ఫన్ రైడ్ లా ఉండటంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు లేటెస్ట్ బ్యూటీ శ్రీలీలను అనుకున్నారు మేకర్స్. ఆమెతో కొంత పార్టీ షూట్ కూడా చేశారు. అయితే సినిమాలో బోల్డ్ కంటెంట్, లిప్ లాక్ సీన్స్ ఎక్కువ ఉండటంతో శ్రీలీల ఈ ప్రాజెక్టు నుండి బయటకు వచేసిందనే టాక్ వినిపించింది. ఇది నిజమేనని ట్రైలర్ చూశాక అర్థమైంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. నిన్నమొన్నటివరకు పద్ధతిగా ఉన్న అనుపమ ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో రచ్చ రచ్చ చేసింది. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే.. ఇక ఫుల్ సినిమాలో రొమాన్స్ పాళ్ళు గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. 

దీంతో శ్రీలీల తీసుకున్న డెసిషన్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కెరీర్ ఇప్పుడు మొదలైంది స్టార్టింగ్లోనే ఇలాంటి పాత్రలు అంటే కెరీర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టిల్లు స్క్వైర్ నుండిరి బయటకు వచ్చి శ్రీలీల మంచి డెసిషన్ తీసుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి డీజే టిల్లుకి మించిన కంటెంట్ తో వస్తున్న టిల్లు స్క్వైర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.