
‘డీజే టిల్లు’గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ... త్వరలో ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్‌లో రాధికతో ప్రేమ కారణంగా ఇబ్బందులు పడ్డ టిల్లు.. ఈసారి మరో అమ్మాయి కారణంగా సమస్యల్లో ఇరుక్కుంటాడని అర్థమవుతోంది. ఆ పాత్రను అనుపమ పోషిస్తోంది.
‘నా హార్ట్ చాలా వీక్... పోయినసారి కంటే ఈసారి గట్టిగ తగిలేటట్టున్నది నాకు దెబ్బ.. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేనొక కారణజన్ముడిని. నా ఈ జన్మకు కారణం ఏమిటంటే ఈ ఊర్ల అన్ని లేడీస్ పంచాయితీలు తెచ్చి నా నెత్తికి తగిలించుకునుడు..’ లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకూ ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్‌లో కనిపించిన అనుపమ.. ఇందులో అందుకు భిన్నంగా కనిపించింది. లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్‌లో కనిపించింది. తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. మార్చి 29న సినిమా విడుదల కానుంది.