ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ చేసే యూత్‌‌‌‌ మూవీ.. 26న రిలీజ్..

ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌ చేసే యూత్‌‌‌‌ మూవీ.. 26న రిలీజ్..

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్  ప్రధాన పాత్రల్లో నటించిన  తమిళ మూవీ  ‘యూత్’. ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై హౌస్ ఫుల్ వినీత్, సందీప్ తెలుగులో విడుదల చేస్తున్నారు.  కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ  ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా  సోమవారం హైదరాబాద్‌‌‌‌లో ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు. దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా, రవికిరణ్ కోలా, వెంకటేష్ నిమ్మలపూడి, గోపీనాథ్ రెడ్డి,  ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి తనూజ్, సాయి మార్తాండ్ కార్యక్రమానికి హాజరై టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ ‘మా సినిమాకు సపోర్ట్‌‌‌‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.  ఈ సినిమా చూసిన తర్వాత  లైఫ్‌‌‌‌లోని స్ట్రెస్ అంతా మర్చిపోతారు.  పేరెంట్స్ గురించి ఒక్కసారి మళ్లీ ఆలోచిస్తారు.  మా సినిమాది ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ గోత్రం, యూత్‌‌‌‌ను థియేటర్స్‌‌‌‌కు తెప్పించే నక్షత్రం’ అని చెప్పాడు.  

తమిళంతోపాటు తెలుగు ఆడియెన్స్‌‌‌‌కు పరిచయం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్స్ ప్రియాన్షి యాదవ్, మీనాక్షి అన్నారు. ‘యూత్’ గ్యాంగ్ ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుందని నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.