తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే వస్తాయని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఎన్నికలు 2028 డిసెంబర్ నెలలో రావాల్సి ఉంటుందని.. అయితే ఈసారి మరో నాలుగు, ఐదు నెలలు వాయిదా పడి.. 2029లో వస్తాయన్నారాయన.
2029 దేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. ఆ క్రమంలోనే 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడి.. 2029లో కేంద్రంతోపాటు నిర్వహించే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వం సైతం ఈసారి జమిలీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుందని.. ఆ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలు 2029లోనే జరుగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2029లో ఎన్నికలు జరిగితే.. ఏపీతోపాటే ఈసారి తెలంగాణ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి వరకు ఆరు నెలలు గ్యాస్ ఉంటుందని.. ఈసారి మాత్రం ఒకేసారి జరగనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో స్పష్టం అవుతుంది.
