- 33 శాతం పెరిగిన కార్ల అమ్మకాలు
- 1,96,203 యూనిట్లను అమ్మిన మారుతి
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు గత నెల 33 శాతం పెరిగి 4.70 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గత జులైలో 3.50 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకితో పాటు హ్యుందాయ్ రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి.
టాటా మోటార్స్, మహీంద్రా కూడా అత్యధిక వృద్ధిని సాధించాయి. జీఎస్‌టీ రేట్లతోపాటు వడ్డీ రేట్ల తగ్గింపు, పన్ను రాయితీలు ఆటో రంగానికి ఎంతో ఊతమిచ్చాయి. మారుతి సుజుకి 1,96,203 యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.
గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు 43.4 శాతానికి పైగా పెరిగాయి. ఎంట్రీ లెవెల్ కార్ల నుంచి ఎస్‌యూవీల వరకు అన్ని సెగ్మెంట్లలోనూ మంచి వృద్ధి కనిపిస్తోంది. హ్యుందాయ్ కూడా 54,210 యూనిట్లను విక్రయించి అత్యుత్తమ పనితీరు కనబరిచింది.
టాటా మోటార్స్ వాహనాల విక్రయాలు 58 శాతం పెరిగి 62,611 యూనిట్లకు పైగా నమోదయ్యాయి. మహీంద్రా, టయోటా, కియా, ఎంజీ మోటార్స్ వంటి ఇతర ప్రముఖ కంపెనీలు కూడా తమ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించాయి.
