పిల్లల జ్ఞాపకశక్తి కోసం బెస్ట్ ఫుడ్ ఇదే

పిల్లల జ్ఞాపకశక్తి కోసం బెస్ట్ ఫుడ్ ఇదే

ఎంత పెద్ద మేధావి అయినా అన్నివిషయాలు గుర్తు పెట్టుకోలేరు. నిజానికి జ్ఞాపకశక్తి అంటే గుర్తుకితెచ్చుకోవడం అని అందరికీతెలుసు. కానీ విద్యార్థులకి కావల్సింది చదివింది గుర్తుకు తెచ్చుకోగల్గిన జ్ఞాపకశక్తి. ఉదాహరణకి మీరొక సినిమాని ఒకసారి చూసి ఇంకొకరికి మొదటి నుంచి చివరి వరకు చెప్పగలరు. విద్యార్థులకి ఇలాంటి జ్ఞాపకశక్తి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. విద్యార్థికి చదివింది ఎక్కువకాలం గుర్తుండే జ్ఞాపకశక్తి కావాలి. ఇలాంటి దృఢమైన, బలమైన జ్ఞాపకశక్తి పొందాలంటే ఏమి చేయాలి? మనం ఏవైనా విషయాలు విన్నప్పుడు లేదా చదివినప్పుడు అవి కొంతకాలం జ్ఞాపకం ఉంటాయి. క్రమేపీ ఆ విషయాలను మనం మరిచిపోతుంటాం. ఒకవిధంగా మరిచిపోవడమనేది వరంగా భావించాలి, విషాదసంఘటనలు అప్పుడప్పుడు వెంటాడుతుంటాయి. కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఆకుకూరలు, బ్రోకోలీ, కాలిప్లవర్ లాంటి కూరగాయలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వాల్ నట్స్ వంటి వాటిలో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. దాంతోపాటు పజిల్స్ కూడా నింపుతూ ఉండాలి. కొన్ని రోజులు ఇలా చేయడం వల్ల మతిమరుపు తగ్గుతుంది.