Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప

Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప

భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు విశ్వనేత(Vishwanetha) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. దాదాపు భారతదేశంలోని అన్ని  భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. సి.హెచ్‌.క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వందే మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై కాశిరెడ్డి శరత్‌ రెడ్డి నిర్మించనున్నాడు. 

తాజాగా ఈ సినిమాలో నరేంద్ర మోడీగా ఎవరు చేయనున్నారు అనేదానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు తమిళ స్టార్ సత్యరాజ్ మోదీ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఇక విశ్వనేత సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో.. అభయ్‌ డియోల్‌, అనుపమ్‌ఖేర్‌, నీనా గుప్తా, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ ప్రెస్టీజియస్ సినిమాకు సంగీతం అందించనున్నాడు.