ఘనంగా హీరో అర్జున్​ కూతురు నిశ్చితార్థం.. వీడియో వైరల్

ఘనంగా హీరో అర్జున్​ కూతురు నిశ్చితార్థం.. వీడియో వైరల్

యాక్షన్​ కింగ్​ అర్జున్(Arjun)​ కుమార్తె, కోలీవుడ్​ హీరోయిన్​ ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun)​ పెళ్లిపీటలెక్కనుంది. తమిళ కమెడియన్​ తంబి రామయ్య(Thambi Ramayya) కొడుకు ఉమాపతి(Umapathi)తో ఐశ్వర్య ప్రేమలో ఉందని ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి.దీంతో వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిన విషయం తెలిసిందే.  

తాజాగా ఐశ్వర్య అర్జున్ కి హీరో ఉమాపతితో ఎంగేజ్​మెంట్ ఘనంగా జరిగింది. ఇరువురి పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్న ఈ జంట త్వరలో ఒక్కటవ్వబోతున్నారు. ఈ వేడుకకు పలువురు కోలీవుడ్​ నుంచి సినీ, రాజకీయ  ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అర్జున్​ ఇద్దరు కుమార్తెల్లో ఐశ్వర్య పెద్దమ్మాయి. ఐశ్వర్య అర్జున్ 2013లో నటిగా అరంగేట్రం చేసింది. తన కుమార్తెను నటిగా నిలబెట్టేందుకు ఈ సీనియర్​ హీరో ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తానే డైరెక్టర్​గా మారి కుమార్తెను హీరోయిన్​గా పెట్టి సినిమా తీసినా అది హిట్టవ్వలేదు. ఇప్పుడు హీరో ఉపేంద్ర అన్న కొడుకుతో మరో సినిమాకు ప్లాన్​ చేశాడు. 

ఇక ఉమాపతి 2017లో అడగపట్టదు మగజనంగాలేతో అరంగేట్రం చేశాడు. అర్జున్ సర్జా హోస్ట్ చేసిన అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షో సర్వైవర్‌లో కనిపించాడు. ప్రస్తుతం 'దేవ్‌దాస్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు.

ALSO READ:- ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్
 

రీసెంట్ గా  (అక్టోబర్ 25)న విక్టరీ వెంకటేశ్‌(Victory Venkatesh) రెండో కూతురు హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్‌ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్న విషయం తెలిసిందే.