Nani: నాని, సందీప్ రెడ్డి వంగాకు అవార్డులు..సినిమా చేసేయండి బాస్

Nani: నాని, సందీప్ రెడ్డి వంగాకు అవార్డులు..సినిమా చేసేయండి బాస్

సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga).. ప్రస్తుతం ఇది పేరు కాదు ఒక బ్రాండ్. హీరోలకు యాటిట్యూడ్ పెట్టి, వైలెంట్ కంటెంట్ తో తనదైన స్టైల్లో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు ఈ దర్శకుడు.

లేటెస్ట్గా చెన్నైలో జరిగిన బిహెన్డ్ వుడ్స్ గోల్డ్ హాల్ ఆఫ్ ఫేమర్స్(Behindwoods Gold of Famers Awards) ఈవెంట్లో యానిమల్ మూవీకి గానూ సందీప్ రెడ్డి వంగ బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకున్నాడు. అలాగే ఇదే వేదికపై టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని(Nani) హాయ్ నాన్న మూవీకి గానూ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.ఈ అవార్డుని డైరెక్టర్ సందీప్ వంగ హీరో నానికి అందించాడు. అలాగే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా హాయ్ నాన్న మూవీని తెరకెక్కించిన శౌర్యువ్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకేకించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ మొన్నొచ్చిన యానిమల్.. ఇలా ఏ సినిమా చూసినా హీరోల పాత్రలు చాలా బిన్నంగా ఉంటాయి. హీరోల యాటిట్యూడ్ తో హాయ్ రేంజ్ కిక్కిస్తున్నాడు సందీప్. ఇక యానిమల్ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర రూ.850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 

హీరో నాని తన స్టోరీ సెలెక్షన్ పరంగా ఎప్పుడు మంచి దారిలోనే వెళుతున్నాడు. తాను ఎంచుకునే స్టోరీస్ లో ఏదో విభిన్నమైన కథాంశం ఉండేలా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటాడు. ఇదిలా ఉంటే.. బిహెన్డ్ వుడ్స్ హాల్ ఆఫ్ ఫేమర్స్ అవార్డుల వేదికపై సందీప్..నాని కనిపించగా..ఫ్యాన్స్ ఫోకస్ వారిపై పడింది.

ఫ్యూచర్ లో ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉండే సందీప్ వంగ డైరెక్షన్ లో..కూల్ గా ఉండే నాని తో సినిమా పడితే చూడాలనుంది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఒక సాలిడ్ సినిమాతో నాని-సందీప్ రెడ్డి వంగ ఆడియన్స్ ని థ్రిల్ ఇస్తారేమో చూడాలి.