మహేష్ సరసన ఇండోనేషియా బ్యూటీ .. ఎవరీ చెల్సియా?

మహేష్ సరసన ఇండోనేషియా బ్యూటీ ..  ఎవరీ చెల్సియా?

సూపర్ స్టార్ మహేష్ బాబు,  దర్శకధీరుడు రాజామౌళి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.  పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపోందుతున్న ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టి్ంగ్  న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ సరసన  ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ నటించనుందని తెలుస్తోంది.   

ఇందుకు కారణం లేకపోలేదు.  చెల్సియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో దర్శకుడు రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.  అయితే దీనిపై  మేకర్స్ స్పందించాల్సి ఉంది.  అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించనుందంటూ వార్తలు వచ్చాయి.  

జకార్తాలో స్టడీ కంప్లీట్ చేసిన చెల్సియా 2013లో హాలీవుడ్‌ ఫిల్మ్‌ రిఫ్రైన్‌ తో తెరంగేట్రం చేసింది. తర్వాత ‘స్ట్రీట్‌ సొసైటీ’, ‘హెడ్‌షాట్‌’, ‘మే ది డెవిల్‌ టేక్‌ యు’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది.  

ALSO READ :- ఖతార్‌లో ఎనమిది మంది భారతీయులకు మరణశిక్ష రద్దు..

ప్రస్తుతం స్ర్కీప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి నటీనటుల ఎంపిక జరగుతోంది.  హాలీవుడ్ తరహాలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎక్కువగా వీదేశీ నటులను ఎంపిక చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా..  కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు.