రానా పెళ్లికి డేట్ ఫిక్స్

రానా పెళ్లికి డేట్ ఫిక్స్

టాలీవుడ్లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకడైన హీరో రానా త్వరలో ఓ ఇంటివాడు కానున్న సంగతి అందరికీ తెలిసిందే. రానా, మిహికా బజాజ్ల పెళ్లి ఆగస్టు 8న జరగనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా వీరి పెండ్లి పోస్ట్పోన్ అయ్యిందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దాంతో క్లారిటీ ఇవ్వడానికి ఫ్యామిలీ ముందుకొచ్చింది. పెళ్లి వాయిదా పడలేదని, ముందుగా అనుకున్నట్టే ఆగస్ట్ 8న పెళ్లి జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. ఇటీవలే ఇరు కుటుంబాల సమక్షంలో ‘రోకా’ వేడుక జరిగింది. పెళ్లి కూడా అతి కొద్దిమంది స్నేహితులు, చుట్టాలు, సన్నిహితుల సమక్షంలో రూల్స్కు అనుగుణంగా మూడు రోజుల పాటు జరుగుతుందట. పెళ్లికి ముందు రెండు రోజులు.. అంటే ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగనున్నాయి.

మరిన్ని వార్తల కోసం

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఒక్కొక్కరికీ 12 గంటల డ్యూటీ!