విజయకాంత్‌కు నివాళులు అర్పించిన సూర్య.. గురువును చూసి బోరున ఏడ్చేశాడు

విజయకాంత్‌కు నివాళులు అర్పించిన సూర్య.. గురువును చూసి బోరున ఏడ్చేశాడు

తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(Vijayakanth) సమాధి వద్ద నివాళి అర్పించారు హీరో సూర్య(Suriya). విజయకాంత్ మృతి చెందిన సమయంలో షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉన్న సూర్య.. గురువారం చెన్నై తిరిగొచ్చారు. అనంతంగా ఈరోజు విజయకాంత్ సమాధి వద్ద పూలమాల సమర్పించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయకాంత్ తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సూర్య.. కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక విజయకాంత్, సూర్యల అనుబంధం గురించి మాట్లాడాలంటే.. పెరియన్నా సినిమాలో విజయకాంత్ తో కలిసి పని చేశారు సూర్య. అప్పటివరకు సోలోగా చాలా సినిమాలు చేసినప్పటికీ.. విజయకాంత్ తో చేసిన పెరియన్నా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. ముందు ఈ సినిమాలో చిన్న పాత్ర కోసం సూర్యను తీసుకున్నారు కానీ, సూర్య నటన నచ్చిన విజయకాంత్‌.. అతని రోల్‌ మరింత పెంచారు. అలా సూర్య కెరీర్ పికప్ అవడానికి సహాయం అందించారు విజయకాంత్.