Teja Sajja: హనుమాన్ హిట్ ఎఫెక్ట్.. తేజ సజ్జ భారీ రెమ్యునరేషన్

Teja Sajja: హనుమాన్ హిట్ ఎఫెక్ట్.. తేజ సజ్జ భారీ రెమ్యునరేషన్

హనుమాన్(HanuMan) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు కుర్ర హీరో తేజ సజ్జ(Teja Sajja). అంతకుముందు మాములుగా తేజ క్రేజ్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఇక సినిమాలో అతని నటనకు మంచి మార్కులే పడ్డాయి. లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ ఇలా ప్రతీ ఎలిమెంట్ లో ఆడియన్స్ ను ఫిదా చేశాడు తేజ. ఇక హనుమాన్  సూపర్ సక్సెస్ అవడంతో తేజ తరువాత సినిమాలపై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. 

అంతే కాదు ఒకే ఒక్క హిట్టుతో తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశాడట తేజ. హనుమాన్ ముందు నుండి హనుమాన్ సినిమా వరకు కేవలం లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న తేజ సజ్జ.. హనుమాన్ సూపర్ సక్సెస్ తరువాత ఏకంగా కోట్లు దాటించేశాడట. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు తరువాతి సినిమా కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్స్ ఒకే ఒక హిట్టుతో ఈ రేంజ్ డిమాండా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తేజ సజ్జ సినిమాల విషయానికి వస్తే.. ఈ కుర్ర హీరో తన తరువాతి సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో ప్లాన్ చేస్తున్నాడట. ఈ దర్శకుడు ఈ మధ్య రవితేజతో ఈగల్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ దర్శకుడు ఇప్పుడు తేజ సజ్జ కోసం ఒక స్టైలీష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథను ఫిక్స్ చేశాడట. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ ప్రాజెక్టుకు సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.