నేను ఏ అమ్మాయితో తిరగడం లేదు.. వైరల్ వీడియోపై విశాల్

నేను ఏ అమ్మాయితో తిరగడం లేదు.. వైరల్ వీడియోపై విశాల్

గత రెండు రోజులుగా తమిళ హీరో విశాల్(Vishal) కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విశాల్ ఫారిన్ లో ఒక అమ్మాయితో కనిపించడంతో.. దానిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆమెతో విశాల్ డేటింగ్ లో ఉన్నదంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీంతో తమిళ ఇండీస్ట్రీతో పాటు.. ఆయన ఫ్యాన్స్ కూడా అవాక్కయ్యారు. 

అయితే తాజాగా ఆ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చారు హీరో విశాల్.. సినీ లవర్స్, నెటిజన్స్, అందరూ నన్ను క్షమించండి. ఆ వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో చేస్తాను. అందులో కొంత నిజం, మరికొంత ఫ్రాంక్ ఉంది. అది న్యూయార్క్ లో తీసిన వీడియో. నేను.. మా కజిన్స్ అక్కడికి వెళ్లి కొద్ది రోజులు సరదాగా గడుపుతాం. సినిమాలతో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆ వెకేషన్ ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నేను ముఖాన్ని ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందంటే.. అది ఫ్రాంక్ వీడియో కాబట్టి. నన్ను ఆట పట్టించేందుకు మా కజిన్స్ సరదాగా తీశారు.

Also read : విజయకాంత్ మరణవార్త తట్టుకోలేక..వెక్కి వెక్కి ఏడ్చిన విశాల్
 

అలా చేయాలని చెప్పి మరీ ఆ వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడు కూడా నాకు చెప్పారు కానీ.. చాలా మంది ఆ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పటికైనా ఈ హాగానాలకు ఫుల్ స్టాఫ్ పడుతుందని అనుకుంటున్నాను.. అంటూ క్లారిటీ ఇచ్చారు విశాల్.

ఇక విశాల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు హరితో రత్నం అనే మాస్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. ఇటీవల వచ్చిన టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.