ఆ డైరెక్టర్​ టార్చర్ కు మూడురోజులు సరిగా నిద్రపోలే: జెనీలియా

ఆ డైరెక్టర్​ టార్చర్ కు మూడురోజులు సరిగా నిద్రపోలే: జెనీలియా

జెనీలియా(Genelia) పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే సినిమా బొమ్మరిల్లు. హాసినిగా ఈ హీరోయిన్​ చేసిన రోల్​ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్​. మూవీలో చిన్న చిన్న సీన్లపైనా డైరెక్టర్​ భాస్కర్ ఎంతో శ్రద్ధ తీసుకునేవాడట. కానీ, అప్పట్లో అది తనకు టార్చర్​లా అనిపించేదని ఈ బ్యూటీ తెలిపింది. 

బొమ్మరిల్లు సినిమాలో హీరో హీరోయిన్​ను మిడ్​నైట్​ ఐస్​క్రీం తినేందుకు బయటకు తీసుకెళ్లే సీన్​ను రాత్రి పూట షూట్​ చేశారట. ఎన్ని షాట్లు తీసినా డైరెక్టర్​ సాటిస్ఫై అయ్యేవాడు కాదని..ఏకంగా ఈ సీన్​ కోసం మూడు రోజుల పాటు టీం మొత్తం నిద్రలేకుండా గడిపినట్టు తెలిపింది. ఇందులో ఇక నటించేది లేదని జెనీలియా ఫిక్సైందట. కానీ, తన బెస్ట్​ ఫ్రెండ్​ అల్లు అర్జున్​ చెప్పడంతో ఫైనల్​గా డెసిషన్​ మార్చుకున్నట్టు తెలిపింది. కట్​ చేస్తే..బొమ్మరిల్లు విడుదలై ఇండస్ట్రీ హిట్​గా నిలిచింది. జెనీలియా పేరు మార్మోగింది. ఈ మూవీ వెనుక ఇంత కథ నడిచిందని జెనీలియా వివరించింది. 

తమిళ ఎస్ శంకర్ డైరెక్షన్ లో బాయ్స్ మూవీతో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది జెనీలియా. ఇక వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోలందరికి వాంటెడ్ హీరోయిన్ లా వెలిగింది. జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్,రామ్ చరణ్, వెంకటేష్, లాంటి స్టార్ హీరోస్ తో నటించి శభాష్ అనిపించుకుంది. 

ALSO READ : ఎలక్షన్స్ను టార్గెట్ చేసిన సంపూ.. ఆసక్తిగా మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్
 

ఇక పెళ్లి తర్వాత జెనీలియా కొన్నాళ్ళు  సినిమాలకు బ్రేక్ ఇచ్చి..మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. తెలుగులో ఆరెంజ్ సినిమా లాస్ట్ మూవీ. ఇప్పటికే భర్త రితేష్‌తో కలిసి తెలుగు మజిలీ సినిమాను మరాఠీలో రీమేక్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Genelia Deshmukh (@geneliad)