ఎలక్షన్స్ను టార్గెట్ చేసిన సంపూ.. ఆసక్తిగా మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్

 ఎలక్షన్స్ను టార్గెట్ చేసిన సంపూ.. ఆసక్తిగా మార్టిన్ లూథర్ కింగ్ ట్రైలర్

తమిళ కమేడియన్ యోగిబాబు(Yogibabu) ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మండేల(Mandela). మడోన్నే అశ్విన్(Madonne ashwin) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి తమిళ ఆడియన్స్ ఫిదా అయ్యాడు. ఒక చిన్న గ్రామంలో జరిగే ఒక మంగలివాడి కథే మండేలా. కామెడీగా సాగుతూనే ఎమోషన్ ను పండించిన ఈ సినిమాలో యోగిబాబు నటనకు అవార్డ్స్ కూడా వరించాయి. 

అలాంటి అవార్డు విన్నింగ్ పాత్రలో టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు(Sampoornesh Babu) నటిస్తున్నాడు. మండేలా సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మార్టిన్ లూథర్ కింగ్(Martin Luther King) అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా..కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా స్క్రీన్‌ప్లే, మాటలు రాసి.. పూజ కొల్లూరును దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ ట్రైలర్ ఎంతో ఆలోచింప చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో జరిగే ఎలక్షన్స్ అన్నీ..ఓటుకు నోటుతో సంబంధం ఉందనే భావనను ఇందులో చిపించినట్లు అర్ధం అవుతుంది. అలా..ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య నడిచే ఎలక్షన్స్ ను సరికొత్త పంథాలో చూపించారు డైరెక్టర్. ఉత్తరం వైపు ఒక వర్గం వారుంటే, దక్షిణం వైపు మరొకరు ఉంటారు. ఒకరంటే ఒకరికి పడదు. ఇలా రెండు వర్గాలు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటాయి. ఇంతలో ఊళ్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. దక్షిణం వాళ్ల నుంచి వెంకటేష్ మహా..ఉత్తరం నుంచి నరేష్ పోటీకి దిగుతారు.

అయితే, రెండు వర్గాలకు చిన్న చిక్కు స్టార్ట్ అవుతుందంటూ ఆసక్తి కలిగించారు. వీరు గెలవాలంటే ఒక్క ఓటు తక్కువ వస్తుంది. ఊళ్లో ఆ ఒక్క ఓటు కోసం వెతుకుతున్న టైంలో అసలు ఓటు హక్కే లేని నాయీ బ్రాహ్మణుడు కనబడతాడు. అతడి పేరు కూడా ఊళ్లో వాళ్లకు సరిగా తెలీదు.

ఇక ఓటు హక్కు ఇచ్చే అధికారిణి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో ఓటరు గుర్తింపు కార్డు ఇస్తుంది. ఈ కార్డు నిజంగానే అతడిని కింగుమేకర్ ను చేస్తుంది. ఆ ఓటు కోసం ఇక రెండు వర్గాలు అతడి వెంటబడతాయి. ట్రైలర్ లో ఎలక్షన్స్ అధికారిణి పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ నటన ఆకట్టుకుంటోంది. 

హీరో సంపూర్ణేష్ బాబు తన మొదటిసినిమాతోనే ప్రేక్షకుల నుండి కావాల్సినంత అటెన్షన్ ను రాబట్టుకోగలిగాడు. ఇక ఆ తరువాత నుంచి వచ్చిన సింగం 123, కొబ్బరిమట్ట, బజార్ రౌడీ, పెసరట్టు అంటూ డిఫరెంట్ టైటిల్స్ తో మూవీస్ చేస్తూ..బిజీ స్టార్ గా మారాడు.

ఈ మూవీలో సీనియర్ హీరో నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మహాయాన మోషన్ పిక్చర్స్, ఏపీఐ ఫిల్మ్స్ పతాకాలపై ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర, శిబాశిష్ సర్కార్, ఎల్. వేణుగోపాల్ తదితరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. స్మరణ్ సాయిసాంగ్ సంగీతం అందిస్తున్నాడు. 

  • Beta
Beta feature