ఐపీఎల్ లో ఫామ్ లో లేకపోయినా కొంతమంది ప్లేయర్లపై ప్రతిసారి ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపిస్తారు. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ పవర్ హిట్టర్.. బ్యాటింగ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఖచ్చితంగా ఉంటాడు. ఈ ఇంగ్లాండ్ హిట్టర్ రికార్డ్ ఐపీఎల్ లో ఘోరంగా ఉన్నపటికీ ప్రతిసారి ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేస్తారు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో కూడా అదే జరిగింది. లివింగ్‌స్టోన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేశారు. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో మొదట అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఈ ఇంగ్లాండ్ వీరుడు.. చివర్లో భారీ ధరకు అమ్ముడుపోయాడు.
కనీస ధర రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చిన లివింగ్ స్టోన్ ను దక్కించుకునేందుకు ప్రారంభం నుంచి సన్ రైజర్స్ పోటీపడింది. మొదట కేకేఆర్ పోటీలోకి రాగా.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ బిడ్డింగ్ వార్ ను ఆసక్తికరంగా మార్చేసింది. గుజరాత్ తప్పుకోవడంతో అనూహ్యంగా లక్నో రేస్ లోకి వచ్చింది. ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ను కొనడానికి సన్ రైజర్స్ కు తీవ్ర పోటీ ఇచ్చింది. అయితే బిడ్డింగ్ రూ.13 చేరడంతో లక్నో వద్ద డబ్బు లేకపోవడంతో వెనక్కి తగ్గింది. దీంతో రూ. 13 కోట్ల ధరకు లియామ్ లివింగ్‌స్టోన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
గత సీజన్ లో ఘోరంగా విఫలం:
2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధరకు కొనుగోలు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ కు బెంగళూర్ గుడ్ బై చెప్పింది. లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినా ఘోరంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. బౌలింగ్ లోనూ పెద్దగా రాణించింది లేదు. 38 సగటుతో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో ఈ ఇంగ్లాండ్ ఆల్ పవర్ హిట్టర్ ను ఆర్సీబీ రిలీజ్ చేసింది.
We will be 𝐋𝐈𝐕𝐈𝐍𝐆 the dream together from here, Liam 🫶✨
— SunRisers Hyderabad (@SunRisers) December 16, 2025
[Liam Livingstone | TATA IPL Auction | Play With Fire] pic.twitter.com/a9d44ZI0gJ
