T20 World Cup 2026: వరల్డ్ కప్ టాప్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రెండూ అతడికే: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్

T20 World Cup 2026: వరల్డ్ కప్ టాప్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రెండూ అతడికే: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్

2026 టీ20 వరల్డ్ కప్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ మెగా టోర్నీని భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నీ చరిత్రలో తొలిసారి 20 జట్లు ఆడుతుండడంతో భారీ హైప్ చోటు చేసుకుంది . టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఈ మెగా టోర్నీ కోసం ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. టోర్నీకి ముందు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ 2026 టీ20 వరల్డ్ కప్ లో టాప్ స్కోరర్ ఎవరో తన అభిప్రాయాన్ని తెలిపాడు.   

వరల్డ్ కప్ టాప్ స్కోరర్ గురించి మాట్లాడుతూ పాంటింగ్ ఇలా అన్నాడు.. "అభిషేక్ శర్మ స్టార్ బ్యాటర్. ఎక్స్ పీరియన్స్ లేకపోవడం అతనికి సానుకూల విషయం అని నేను భావిస్తున్నాను. 2026 టీ 20 వరల్డ్ కప్ లో అభిషేక్ టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడ కావొచ్చు. అతని హిట్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అభిషేక్ ఆడితే ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ అతను విఫలమైతే ఇండియా వరల్డ్ కప్ ఆశలు సంక్లిష్టం అవుతాయి. ఈ వరల్డ్ కప్ కు అభిషేక్ ఇండియాకు చాలా కీలకం. నేను అభిషేక్ శర్మ మొదటి కోచ్ ని. 17 ఏళ్ళ వయసులో ఢిల్లీ జట్టులో ఉన్నప్పుడే చాలా ప్రభావం చూపించాడు. అభిషేక్ పై నాకు భారీ అంచనాలు ఉన్నాయి". అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. 

తొలిసారి 20 జట్లతో టీ20 వరల్డ్ కప్: 

ఈ సారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా (USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు. 

నెంబర్ వన్ ర్యాంక్ లో అభిషేక్ శర్మ:

అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. వరల్డ్ క్రికెట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. ప్రత్యర్థి, వేదిక, బౌలర్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ తో బౌలర్లకు చెమటలు పట్టిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓవరాల్ గా ఈ సిరీస్ లో 45 యావరేజ్.. 250 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.