న్యూఢిల్లీ: ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మిత్రదేశాలైన ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇండియాపై ట్రంప్ యడాపెడా విధించిన వాణిజ్య సుంకాలే. ప్రతీకార సుంకాలు అని 25 శాతం, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుదని సాకుతో మరో 25 శాతం.. మొత్తం ఇండియాపై 50 శాతం సుంకాలు విధించాడు ట్రంప్.
దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కూడా నిలిచిపోయాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం (ఫిబ్రవరి 2) ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్నిభారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. సోమవారం ట్రంప్ ప్రధాని మోడీతో ఫోన్‌లో సంభాషించారని తెలిపారు.
వేచి ఉండండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లో ఇండియా గేట్ ఫొటో షేర్ చేసి ప్రశంసలు కురిపించారు. ఇండియా గేట్ కట్టడం అద్భుతమని కొనియాడారు. ఇలాంటి కట్టడం అమెరికాలో కూడా నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మోడీ, తన ఫొటో ఉన్నఓ మ్యాగజైన్ కవర్ పేజీ చిత్రాన్ని కూడా ట్రంప్ షేర్ చేశారు. మొన్నటి వరకు ఇండియాపై సుంకాలతో విరుచుకుపడ్డ ఒక్కసారిగా మెతక వైఖరి అవలంభిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. భారత్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకునే వ్యూహంలో భాగంగానే ట్రంప్ తన వైఖరి మార్చుకున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
