హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. ఫిబ్రవరి 25, 2026 న BHEL లింగంపల్లి నుంచి బయల్దేరే బస్సు.. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఉడిపి, మురుడేశ్వర్ ఆలయం మీదుగా గోవా వెళ్లి, తిరుగు ప్రయాణం 01/03/2026న ఉదయం 6 గంటలకు బయలుదేరి గోవా నుంచి MGBS మీదుగా లింగంపల్లి వస్తుంది. ఈ సర్వీస్కు ప్రయాణ రుసుము 5130 రూపాయలు.
ప్రయాణీకులు టికెట్ బుకింగ్ కోసం www.tgsrtcbus.in ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చని TG RTC తెలిపింది. ఈ బస్ సర్వీస్ నెంబర్ 97788. ఇప్పటికే ఈ విషయం తెలిసిన కొందరు టికెట్లు బుక్ చేసుకున్నారు. గోవా వెళ్లే వారికే కాదు ఈ లోపు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే భక్తులకు కూడా ఈ టూర్ ప్యాకేజ్ ఉపయోగకరంగా ఉంటుందని TGSRTC తెలిపింది.
