ఇప్పటికే అనుభవిస్తున్నవు చాలదా: కేటీఆర్‎పై మంత్రి సీతక్కఫైర్

ఇప్పటికే అనుభవిస్తున్నవు చాలదా: కేటీఆర్‎పై మంత్రి సీతక్కఫైర్

హైదరాబాద్: మేడారం మహా జాతర నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆదివాసీ బిడ్డగా, మంత్రి హోదాలో నిరంతరం శ్రమించి మేడారం మహా జాతరను గ్రాండ్స్ సక్సెస్ చేశామని.. అది మీ కళ్లకు కనిపించ లేదా అని ప్రశ్నించారు. 

ఆడబిడ్డను అబాసుపాలు చేస్తే ఆగమైవతని.. సొంత చెల్లిన మోసం చేసి ఇప్పటికే అనుభవిస్తూ ఇంకా చాలదా కేటీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. మీరు ఒక్కరోజు కూడా సమ్మక్క–సారక్క దర్శనానికి రాలేదని.. అలాంటి మీరు తల్లుల మీద నెగటివ్ ప్రచారం చేయకండి కర్మ ఫలితం తప్పదని హెచ్చరించారు. 

నాపై రాజకీయాలు చేయండి కానీ మా దేవుళ్లపై కాదన్నారు. మా దేవుళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 2026 సమ్మక్క–సారలమ్మ మహా జాతర విజయవంతమైందన్నారు. వారం రోజుల పాటు మేడారం దగ్గర 24/7 డ్యూటీలో ఉండి జాతరను సూపర్ సక్సెస్ చేశామని చెప్పారు. 

మొదటి రోజు నుంచి కొన్ని శక్తులు, పార్టీలు తప్పుడు వార్తలతో గుడి నిర్మాణాన్ని అడ్డుకోబోయానని.. కానీ పూజారుల ఆమోదం, ఎండోమెంట్ అనుమతితో 100 రోజుల్లో గుడి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. మేడారం జాతరలో 13 వేల మంది పోలీసులు సేవలందించారని, చిన్నపాటి లోపాలు ఏవైనా ఉంటే భవిష్యత్తులో మరింత మెరుగ్గా సరిదిద్దుకుంటామన్నారు. భక్తులు సంతోషంగా వన దేవతలనుదర్శనం చేసుకున్నారని తెలిపారు.