ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. కొన్నేళ్లుగా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఫాస్ట్ బౌలర్స్ పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజల్ వుడ్ అందుబాటులో ఉండడం లేదు. కొన్ని నెలల క్రితం స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే వెన్ను గాయం కారణంగా పాట్ కమ్మిన్స్ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. తాజాగా జోష్ హేజల్ వుడ్ వరల్డ్ కప్ లోని గ్రూప్ మ్యాచ్ లకు దూరం కావడంతో కంగారులకు వరల్డ్ కప్ ముందు కోలుకోలేని దెబ్బ తగిలింది.
గ్రూప్ మ్యాచ్ లకు హేజల్ వుడ్ ఔట్:
హేజల్ వుడ్ మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఈ స్టార్ పేసర్ ప్రస్తుతం సిడ్నీలో పునరావాసం పొందుతున్నాడు. వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టుతో పాటు జోష్ ఇండియాకు ట్రావెల్ చేయడం లేదు. హేజల్ వుడ్ స్థానంలో సీన్ అబాట్ ను ట్రావెలింగ్ రిజర్వ్ గా ఎంపిక చేశారు. గాయం కారణంగా యాషెస్ సిరీస్ కు దూరమైన ఈ ఆసీస్ పేసర్..పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి కష్టపడుతున్నాడు. సూపర్ 8 మ్యాచ్ లకు కూడా హేజల్ వుడ్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. హేజల్ వుడ్ తో పాటు మరో ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ కూడా ఫిట్ బేస్ సమస్యలతో బాధపడుతున్నాడు.
వెన్ను గాయంతో కమ్మిన్స్ ఔట్:
స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి కమ్మిన్స్ వైదొలిగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ మార్క్యూ ఈవెంట్‌కు కమ్మిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియాకు భారీ ఎదురు దెబ్బనేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీమ్‌లో ప్రధానంగా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను గాయం కారణంగా పాట్ కమ్మిన్స్ మెగా టోర్నీకి దూరం కాగా అతడి స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేసింది. ఇక, తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌ను తప్పించి అతని స్థానంలో మాట్ రెన్షాను జట్టులోకి తీసుకుంది. సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజల్ వుడ్ త్రయం లేకుండా ఆసీస్ పేస్ బౌలింగ్ కొంచెం బలహీనంగా మారింది. ఇటీవలే పాకిస్థాన్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా 0-3 తేడాతో కోల్పోయింది. బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తున్నా బౌలింగ్ లో మాత్రం కంగారూల జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేదు. స్పిన్నర్ ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్ పై ఆసీస్ భారీ ఆశలు పెట్టుకుంది. జట్టులో ఎక్కువగా ఆల్ రౌండర్లు ఉండడం కలిసొచ్చే విషయం.
Australia are in a very big problem now. Mitchell Starc retired from T20 cricket a long time ago. Pat Cummins has been ruled out of the T20 World Cup.
— DarkIntelX (@DarkIntelX) February 2, 2026
- and Josh Hazlewood will miss the first phase of the tournament. Now who will handle their bowling attack what do you think? pic.twitter.com/ybxUX81Bdq
