గతవారం చివరి నుంచి బంగారం, వెండి రేట్లు వరుసగా కుప్పకూలుతున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ తర్వాత వీటి ధరలు మరింతగా దిగొచ్చాయి. బంగారం, వెండి రేట్ల ఓవర్ ర్యాలీకి ట్రంప్ కొత్త ఫెడ్ చైర్మన్ నియామక ఎంపిక కళ్లెం వేసిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ ప్రాంతంలో ఉన్న తాజా రేట్లను గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
ఫిబ్రవరి 2న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. దీంతో ఫిబ్రవరి 1 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.905 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు నిన్నటి కంటే కొద్దిగా తగ్గి రూ.15వేల 153గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 890గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. భారీగా పడిన షేర్ మార్కెట్
ఇక వెండి రేట్లు కూడా భారీగానే పతనం అవుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొన్ని రోజుల కిందటి వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. కానీ సోమవారం ఫిబ్రవరి 2, 2025న వెండి రేటు కేజీకి రూ.20వేలు తగ్గింది తెలుగు రాష్ట్రాల్లో. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.20వేలు తగ్గి రూ.3లక్షలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.300 వద్ద ఉంది.
