రాజాసింగ్ ఘర్వాపసీ.. బీజేపీలో రీ ఎంట్రీకి ముఖ్య నేతలతో చర్చలు..!

రాజాసింగ్ ఘర్వాపసీ.. బీజేపీలో రీ ఎంట్రీకి ముఖ్య నేతలతో చర్చలు..!

హైదరాబాద్, వెలుగు: గోషామహల్​ఎమ్మెల్యే రాజా సింగ్​తిరిగి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది జూన్‎లో పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. ఇప్పుడు సొంతగూటికి చేరేందుకు రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య చర్చలు సాను కూలంగా జరుగుతున్నట్టు సమాచారం. గతేడాది జూన్​ 30న రాష్ట్ర అధ్యక్షుడి నియామకాన్ని నిరసిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. 

అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, హిందు త్వ అంశాలపై మాత్రం బీజేపీకి మద్దతుగానే నిలుస్తున్నారు. ఇదే టైమ్‎లో గోషామహల్ నియోజకవర్గంలోని బీజేపీ కేడర్‎లో కొంత అనిశ్చితి నెలకొన్నది. తిరిగి బీజేపీలో చేరాలని వారి నుంచి రాజాసింగ్‏పై ఒత్తిడి పెరుగుతోంది. 

ఈనేపథ్యంలో బీజేపీ ముఖ్యనేతలతో టచ్‎లోకి వెళ్లినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజాసింగ్‎ను తిరిగి తీసుకుంటే హైదరాబాద్‎లో పార్టీకి బలం చేకూరుతుందని రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్‎ను పార్టీలోకి ఆహ్వానించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైందని తెలుస్తోంది.