దక్షిణాది సినీ ఇండస్ట్రీలో క్లాసిక్ లవ్ స్టోరీల గురించి చెప్పుకుంటే .. వాటిల్లో ‘7G రెయిన్‌బో కాలనీ’ ( తెలుగులో 7G బృందావన కాలనీ ) మొదటి వరుసలో ఉంటుంది.. 2004లో విడుదలైన ఈ చిత్రం యువతపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. కదిర్-అనితల ప్రేమకథ, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఒక మ్యాజిక్ సృష్టించాయి. ఈ చిత్రంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత, దర్శకుడు సెల్వరాఘవన్ ఆ మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌లోఈ సారి మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో.!
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనస్వర రాజన్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. " సెల్వరాఘవన్ గారి దర్శకత్వంలో పనిచేయాలనేది నా చిరకాల కోరిక. ఈ సీక్వెల్ కథ వినకముందే ఆయన డైరెక్షన్ అని తెలియగానే ఓకే చెప్పేశాను. ఆయన వర్కింగ్ స్టైల్ ఒక ప్రత్యేకమైన స్కూల్ లాంటిది. అక్కడ పనిచేయడం నాకు గొప్ప లెర్నింగ్ ప్రాసెస్" అని అనస్వర చెప్పుకొచ్చారు. మొదటి భాగం చూసినప్పటి నుండి నాకు ఆ సినిమా అంటే ఇష్టం.అని చెప్పారు. ఒరిజినల్ హీరో రవికృష్ణ మళ్లీ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తుండగా, షూటింగ్ సమయంలో ఆయన పాత జ్ఞాపకాలను అనస్వరతో పంచుకుంటున్నారట.
భారీ స్టార్ కాస్ట్.. పాత పాత్రలు కూడా!
ఈ సీక్వెల్‌లో రవికృష్ణ, అనస్వరలతో పాటు సీనియర్ నటుడు జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మొదటి భాగంలో హీరో స్నేహితుడిగా అలరించిన సుమన్ శెట్టి, హీరో తల్లి పాత్రలో నటించిన సుధ మళ్లీ అదే పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.. మొదటి భాగం చివరలో చనిపోయిన అనిత (సోనియా అగర్వాల్) పాత్ర ఈ సీక్వెల్‌లో కనిపిస్తుందా? లేదా? అనేది మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచారు.
అనస్వర తమిళ ఎంట్రీ
7G సీక్వెల్ ఒకవైపు ఉండగానే, అనస్వర రాజన్ నటించిన మరో తమిళ చిత్రం ‘విత్ లవ్’ (With Love) ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అభిషన్ జీవింత్ హీరోగా నటిస్తున్నారు. 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఫేమ్ అభిషన్ ఈ సినిమాతో నటుడిగా పరిచయమవుతున్నారు. సౌందర్య రజనీకాంత్ (Zion Films) ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే పాటల మీద భారీ అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి పాత జ్ఞాపకాలను తట్టిలేపుతూ, కొత్త తరం ప్రేమికులను ఆకట్టుకునేలా '7G రెయిన్‌బో కాలనీ 2' రాబోతోంది. సెల్వరాఘవన్ మార్క్ ఇంటెన్స్ లవ్ స్టోరీకి అనస్వర నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో వండర్ ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.
