Akhil Akkineni: పెద్ది వర్సెస్ లెనిన్.. హిట్ కోసమైనా అఖిల్ వెనక్కి తగ్గుతాడా?

Akhil Akkineni: పెద్ది వర్సెస్ లెనిన్.. హిట్ కోసమైనా అఖిల్ వెనక్కి తగ్గుతాడా?

RRR మూవీ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్కు, పెద్ది సినిమాపై భారీ అంచనాలున్నాయి. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేస్తామని మేకర్స్ ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. మే 1 రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

మరోవైపు అక్కినేని అఖిల్ నటిస్తోన్న లెనిన్ మూవీ కూడా మే 1నే రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా ఉంది. టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి పదేళ్లయినా ఇప్పటికీ ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయినా అఖిల్కి ఈ మూవీ కీలకంగా మారింది. ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత ఆయన నటిస్తోన్న చిత్రం కావడం, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

అయితే ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే, అఖిల్ సినిమా థియేటర్ల పరంగా మరియు వసూళ్ల పరంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో చిత్రంతో పోటీ పడటం “లెనిన్”కు కాస్త కష్టంగా మారొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ది రిలీజ్ పై మేకర్స్ మరోసారి అధికారిక ప్రకటన చేస్తే గానీ ఈ కన్ఫ్యూజన్కు తెరపడదు.

'లెనిన్' సినిమా కథా బ్యాక్ డ్రాప్ గురించి చెప్పాలంటే.. ఇది ప్రధానంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంతపు కథాంశంతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. పక్కా లోకల్ ఫ్లేవర్, ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో హైలైట్‌గా ఉండనున్నాయని సమాచారం. మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు, ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది.