- ఈ ఏడాది రూ.17, 64, 034 కోట్లు పెరిగే చాన్స్
- 8 ఏండ్లలో రూ.1,12,83,876 కోట్లకు పెరిగిన అప్పులు
న్యూఢిల్లీ, వెలుగు: గత పదేండ్ల నుంచి క్రమంగా కేంద్రం అప్పులు పెరుగుతున్నాయి. నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ అప్పుల గణాంకాలు వెల్లడయ్యాయి. 2026 మార్చి 31 నాటికి రూ.1,97,18,016 కోట్లు అప్పు ఉంటే, 2027 మార్చి 31 నాటికి అది రూ.2,14,82,050 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. అంటే ఏడాదిలోనే రూ.17,64,034 కోట్ల అప్పు పెరుగుతుందని ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో రూ.101,98,173 కోట్ల అప్పు ఉంటే, అది 2026–27 నాటికి రూ.2,14,82,050 కోట్లకు పెరగనుంది. అంటే, గడిచిన ఎనిమిదేండ్లలో రూ.1,12,83,876 కోట్లకు అప్పు పెరగనున్నట్లు స్పష్టమవుతున్నది.
2026 మార్చి 31 నాటికి అప్పు రూపాయలు కోట్లలో..
దేశీయ అప్పు 1,90,43,590
విదేశీ అప్పు6,74,426
మొత్తం అప్పు1,97,18,016
2027 మార్చి 31 నాటికి అప్పు
దేశీయ అప్పు 1,90,22,355
విదేశీ అప్పు7,11,181
మొత్తం అప్పు214,82,050
