కాక్రోచ్ పార్టీ ఆందోళనకు టీఎంసీ సపోర్ట్.. ఢిల్లీలో యువతపై దాడిని ఖండించిన మమత

కాక్రోచ్ పార్టీ ఆందోళనకు టీఎంసీ సపోర్ట్.. ఢిల్లీలో యువతపై దాడిని ఖండించిన మమత

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనకు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ మద్దతు పలికారు.  సోమవారం (జూలై30) ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు యూత్ చేపట్టిన ర్యాలీపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను మమత తీవ్రంగా ఖండించారు. 

ఢిల్లీలో యువత, విద్యార్థులపై పోలీసులు జరిపిన అమానుష దాడిని ఖండిస్తున్నానంటూ మమత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సొంత విద్యార్థులకు ప్రభుత్వం భయపడటం ఏంటీ..  చర్చలకు బదులుగా ప్రశ్నలకు సమాధానిమిచ్చే లాఠీ ఛార్జీలు, బాష్ప వాయు గోళాలతో సమాధానం ఇవ్వడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు మమత. 

సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.. శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న యువతపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ర్యాలీలో పాల్గొన్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేతో సహా పలువురు ప్రతినిధులను అరెస్ట్ చేశారు. పోలీస్ లాఠీ ఛార్జ్ లో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నిరాహార దీక్ష చేస్తున్న  సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలికి కూడా గాయాలయ్యాయి.  

ఇదిలా ఉంటే.. చర్చలకు రావాలని కాక్రోచ్  పార్టీ ప్రతినిధులనుప్రభుత్వం ఆహ్వానించిందని సీజేపీ ప్రకటించింది. ఈ మేరకుకేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు భేటీ అయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లతో   ఓ లెటర్ ను ప్రభుత్వానికి అందజేశారు. దీనిపై జేపీ నడ్డా స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ అంతర్గత చర్చలు జరుపుతామని తెలిపినట్లు ప్రతినిధులు చెప్పారు. 

మరోవైపు కాక్రోచ్ పార్టీ చేపట్టి పార్లమెంట్ మార్చ్ కు పలువురు రాజకీయ నేతలు మద్దతు తెలిపారు. విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులపై పోలీసుల వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పబట్టారు. దేశంలో ఏ ప్రధాని చేయని విధంగా ప్రధానిమోదీ యువత పట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. 

కాగా.. కాక్రోచ్ పార్టీ ఆధర్వంలో నిరాహారదీక్ష చేపట్టిన పర్యావరణ ఉద్యమకారుడు, సోనమ్ వాంగుచుక్ తన దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులు, యువత పార్లమెంట్ లో ఎంపీలను కలిసేంత వరకు తన దీక్ష కొనసాగుతుందన్నారు.