గర్బా, దాండియా వేడుకలలో ముస్లింలపై నిషేధం.. VHP సంచలన నిర్ణయం

గర్బా, దాండియా వేడుకలలో ముస్లింలపై నిషేధం.. VHP సంచలన నిర్ణయం

ముంబై: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‎పీ) మహారాష్ట్ర యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మహారాష్ట్రవ్యాప్తంగా జరగనున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే గర్బా, దాండియా వేడుకలలో ముస్లింలు పాల్గొనకుండా నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్వాహకులకు గైడ్‎లైన్స్ జారీ చేసింది. వీహెచ్‎పీ నిబంధనల ప్రకారం.. వేడుక జరిగే ప్రాంతాల ప్రవేశ ద్వారాల వద్ద ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరి నుదుటిపై తిలకం దిద్దాలి. 

ఈ వేడుకలకు హాజరయ్యే వారు ముందుగా పూజలో పాల్గొనేలా చూడాలి. వీహెచ్‎పీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. హిందువుల పండుగల్లో ముస్లింలకు ఏం పని కొందరు వీహెచ్‎పీని సపోర్టు చేస్తుండగా.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో ఇలాంటి నిర్ణయాలు మతపరమైన విభేదాలను సృష్టిస్తాయని కొందరు వ్యతిరేకిస్తున్నారు. 

ALSO READ : వేగంగా బలపడుతున్న ఎల్ నినో.. భారత్పై తీవ్ర ప్రభావం..

వీహెచ్‎పీ కౌంటర్:

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే గర్భా, దాండియా సాంప్రదాయ వేడుకల్లో ముస్లింలను పాల్గొనకుండా నిషేధించాలన్న నిర్ణయంపై వస్తోన్న విమర్శలకు వీహెచ్‎పీ కౌంటర్ ఇచ్చింది. గర్బా అనేది కేవలం ఒక నృత్యం లేదా వినోదం మాత్రమే కాదని, అది దుర్గామాతను ఆరాధించే ఒక పవిత్రమైన ప్రక్రియ స్పష్టం చేసింది. విగ్రహారాధనను వ్యతిరేకించే ముస్లింలు ఈ వేడుకలలో ఎందుకు పాల్గొనాలని విమర్శకులను ప్రశ్నించింది. గర్బా పండుగల ముసుగులో జరిగే లవ్ జిహాద్ ఘటనలను నిరోధించడం కూడా ఈ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటని స్పష్టం చేసింది.