పట్టపగలు చోరీ.. బంగారం షాపులో భారీచోరీ.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి, మొహానికి ముసుగు వేసుకొని గన్స్ తో వచ్చిన దొంగలు.. షాపు ఓనర్, సిబ్బందిని బెదిరించి లక్షల విలువైన నగలు దర్జాగా దోచుకెళ్లారు. దోపీడీ చేసిన బంగారం నగలను గోనె సంచిలో మోసుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని గన్ తో గాల్లోకి కాల్పులు జరిపి భయపెట్టి చోరీ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.. చోరీకి సంబంధించిన దృశ్యాలు సెల్ ఫోన్ లో రికార్డయ్యింది. ఈఘటనలో పాల్ఘర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే..
Palghar, Maharashtra Three armed men carried out a daring daylight robbery at Lakshmi Jeweller's in the Irani Nagar area of Dahanu. The robbers, carrying weapons, stormed the jewellery shop in broad daylight and looted gold and silver items worth several lakhs of rupees before… pic.twitter.com/37LeiPdNWf
— NextMinute News (@nextminutenews7) July 20, 2026
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో సోమవారం (జూలై 30) సాయంత్రం 4గంటలకు ఈచోరీ జరిగింది. బైకులపై వచ్చిన దుండగులు.. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు, మోహానికి ముసుగు, దేశీయ పిస్టల్స్ తో షాపులో కి ప్రవేశించి షాపు యజమాని, సిబ్బంది గన్స్ తో బెదిరించి చోరీ చేశారు. పిస్టళ్లతో బెదిరిస్తూ దోచుకున్న బంగారాన్ని ప్లాస్టిక్ సంచుల్లో నింపుకొని ధైర్యంగా మోసుకెళ్తున్న దృశ్యాలు మొబైల్ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. పారిపోయే ముందు పలుమార్లు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించారు అయితే దుండగులు చాకచక్యంగా తప్పించుకున్నారు. ఓ నిందితుడు పోలీసులు పట్టుబడినట్టు సమాచారం.
